
పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న శిరీష
టేకులపల్లి: పీహెచ్‌సీకి వచ్చేవారికి వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిరీష వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని సులానగర్ పీహెచ్‌సీని శుక్రవారం ఆమె తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఆశ కార్యకర్తలకు జరుగుతున్న సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిక్షణ శిబిరానికి వెళ్లి వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారందరికీ కళ్లజోళ్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్పంచ్‌లు, కార్యదర్శుల సహకారంతో 18 ఏళ్లు నిండిన వారందరినీ కంటివెలుగు శిబిరానికి తరలించి, పరీక్షలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి కందుల దినేష్, అధికారులు అన్నా మేరీ, సీతమ్మ, పీహెచ్‌ఎన్ సత్యవతి, ట్రైనింగ్ సూపర్‌వైజర్లు కె.చిట్టెమ్మ, ఎస్.విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, వీసం శకుంతల, అక్బర్, లలిత, నాగలక్ష్మి, అరుణకుమారి, రమేష్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment