
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, భద్రాద్రి : ప్రేమ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు యువతుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీకి చెందిన మడివి జానకి, విజయ కాలనీకి చెందిన శ్యామల సంగీత అనే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ వ్యవహారంలో వివాదం నెలకొంది. దీంతో బుధవారం వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విషమ పరిస్థితిలో ఉన్న వారిని చర్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. ఆత్మహత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment