దుమ్ముగూడెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల ప్రతాప్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఏఎస్‌ఐ సత్యనారయణ వివరాలు వెల్లడించారు. ప్రతాప్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిర్చి, పత్తి పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో మనోవేదనకు గురై ఈ నెల 12వ తేదీన ఇంట్లో పరుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు వినోద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
గాయపడిన వ్యక్తి
జూలూరుపాడు: మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య (64) పాలు పితుకుతుండగా ఆవు కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ తిరుపతిరావు కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య పాలు పితుకుతుండగా ఆవు కాలితో ఎగిరి తన్నడంతో అతను తీవ్రంగా గామపడ్డాడు. కుటుంబసభ్యులు పాపయ్యను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాపయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఈసం రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తిరుపతిరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment