మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్న తహసీల్దార్, సిబ్బంది
జూలూరుపాడు : మట్టి అక్రమ తవ్వకాలపై జూలూరుపాడు తహసీల్దార్ వి.సురేష్‌కుమార్ కొరడా ఝుళిపించారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలోని పాలగుట్ట సమీపంలో శనివారం అర్థరాత్రి పొక్లెయినర్‌తో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ టిప్పర్లతో మట్టిని తరలిస్తుండగా తహసీల్దార్ వి.సురేష్‌కుమార్, రెవిన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలో 82 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు పొక్లెయినర్‌తో మట్టి తవ్వి, చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు.
ప్రభుత్వ సీలింగ్ భూమిలో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు వెళ్లారు. తవ్వకాలను అడ్డుకున్నారు. పొక్లెయినర్, రెండు టిప్పర్లు స్వాధీనపర్చుకుని సీజ్ చేశారు. పొక్లెయినర్‌ను తరలించే అవకాశం లేకపోవడంతో దానిని కాకర్ల గ్రామంలో నిలిపేశారు. టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయాలని ఎస్సై ఇళ్ల రాజేష్‌తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment