Ramayya
-
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు (ఫోటోలు)
-
కదిరి లాడ్జి బాగోతంలో.. కథ.. స్క్రీన్‌ప్లే అంతా టీడీపీనే!
కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామయ్య లాడ్జి వివాదం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ప్రత్యర్థి పార్టీని అభాసుపాలు చేయడానికి చేసిందేనని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీలోని రామయ్య ప్రత్యర్థి వర్గీయులు స్పష్టంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కథ, స్క్రీన్‌ప్లే అంతా ఆయనా, టీడీపీదేనని వారు చెబుతున్నారు. వీరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5, తదితర ఎల్లో మీడియా తోడయ్యాయని.. వీటికి రామయ్య, టీడీపీ బాగోతం కనిపించడంలేదా అని కదిరి ప్రజలు మండిపడుతున్నారు. వివాదం ఏమిటంటే.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తన కుటుంబానికి చెందిన ‘జొన్నా లాడ్జి’ని 2018లో అనంతపురానికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని శ్రీధర్‌రెడ్డికి రూ.9.50 కోట్లకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయానికి రామయ్య అడ్డం తిరిగాడు. కానీ, మిగిలిన అన్నదమ్ములు మాత్రం తమ వాటా (60 శాతం)ను శ్రీధర్‌రెడ్డికి రిజిస్టర్ చేయించారు. రామయ్య మాత్రం తన 40 శాతం వాటాలో 20 శాతం వాటాను వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి అమ్మేశాడు. చంద్రారెడ్డి దాన్ని తిరిగి శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. మొత్తమ్మీద 80 శాతం వాటా ఇప్పుడు శ్రీధర్‌రెడ్డిదే. కానీ, నాలుగేళ్లుగా లాడ్జిలో వచ్చిన ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పగించకుండా జొన్నా రామయ్య గూండా గిరి చేస్తున్నారు. రామయ్య వైఖరితో అన్నదమ్ముల విభేదం రామయ్య వ్యవహార శైలి నచ్చక సొంత అన్నదమ్ములే ఆయనతో విభేదించారు. ఈ నెల 23న జొన్నా సోదరులంతా కుటుంబ సమేతంగా శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్జి ముందు బండ రాళ్లు వేసి రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే ఉన్న రామయ్యను లాడ్జిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని రామయ్య టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌తోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం లాడ్జి ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిజానికి ఈ వ్యవహారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డికి గానీ ఎలాంటి సంబంధమూలేదు. కానీ, రామయ్య వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. వీరి వ్యవహార శైలిని టీడీపీలోనే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు : జొన్నా సోదరులు ఈ ఘటనపై జొన్నా సోదరులు స్పందిస్తూ.. ‘జొన్నా ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. మా కుటుంబాన్ని ఇప్పుడు బజారుకీడ్చిన మా అన్న రామయ్య కొందరి మాటలు విని, లాడ్జిని స్వాధీనం చేయకుండా జొన్నా కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని ఆరోపించారు. -
ఘనంగా రామయ్య పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం: భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మిథిలా స్టేడియం లోని కల్యాణ మండపంలో సీతమ్మవారితో సింహాసనంపై ఆసీనులైన రామయ్యను చూసి భక్తులు తరించారు. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆ మె రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం పూర్తయ్యాక భద్రాచలంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు. నేడు కొండరెడ్లతో ముఖాముఖి సోమవారం సాయంత్రం దమ్మపేట మండలం నా చారం గ్రామంలో గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయా న్ని దర్శించుకున్న తమిళిసై... మంగళవారం దమ్మ పేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మం డలం గోగులపూడి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వెనుకబడిన వందకుపైగా కొండరెడ్ల కుటుంబాల తో పూసుకుంటలో ముఖాముఖి నిర్వహించనున్నారు. 10 నెలల క్రితమే గవర్నర్ ఈ 3 గ్రామాలను దత్తత తీసుకొని గిరి వికాస్, గిరి పోషణ్ పథకాలతో వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు కోళ్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలి సేందుకు సింగరేణి గెస్ట్‌హౌస్‌కు రాగా బిజీ షెడ్యూల్ ఉందం టూ తమిళిసై సున్నితంగా తిరస్కరించారు. -
భద్రాద్రి రామయ్యకు గిరిజనుల నీరాజనం
ఘనంగా శబరి స్మృతియాత్ర విలీన ప్రాంత గిరిజనుల విశేషపూజలు నెల్లిపాక : ఆంధ్రా సరిహద్దుల్లోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శబరి స్మృతియాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాముడి వనవాస సమయంలో ఆయనకు ఎంగిలి పండ్లు తినిపించిన గిరిజన మహిళ శబరిని జ్ఞప్తి చేసుకుంటూ ఏటా అశ్వయుజ పౌర్ణమినాడు ఈ వేడుకను గిరిజనులు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వందలాది గిరిజనులు ఈయాత్రలో పాల్గొని రామయ్యకు విశేష పూజలు నిర్వహించారు. గిరిజనుల కోలాహలం నడుమ భద్రాచల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శబరిస్మృతి యాత్ర సాగింది. తొలుత గిరిజనులు తమ సంప్రదాయ కొమ్ము, కోయనృత్యాలు, కోలాటాలను స్వామి వారి ముందు ప్రదర్శిస్తూ మూడుసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. శబరి నది నుంచి కలశాలతో తీసుకొచ్చిన జలాలతో గిరిజన మహిళలు మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ధ్వజస్థంభం వద్ద నున్న బలిపీఠానికి గిరిజన మహిళలు పసుపు, కుంకుమలు చల్లి ముగ్గులు వేసి అలంకరించారు. తర్వాత అడవుల్లో దొరికే దుంపలను, పూలను గిరిజనులు ఆలయ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు. గిరిజనులు తీసుకొచ్చిన పూలతో వైకుంఠ రాముడికి కన్నుల పండువగా పుష్పార్చన నిర్వహించారు. శబరి నది పరీవాహక ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాల ప్రజలు అధికంగా ఈయాత్రలో పాల్గొని పూజలు చేశారు.ఈ వేడుకలో జిల్లా జడ్జి వినయ్‌మోహన్, ఆలయ ప్రదానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు పాల్గొన్నారు. -
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్య కల్యాణమూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ చేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలిచ్చారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్ల వంశ క్రమాన్ని వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం చేశారు. స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ చేశారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలిపారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. స్వామివారికి వైభవంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. – భద్రాచలం -
‘బంగారు’ రాముడు
భద్రాద్రి మూలమూర్తులకు త్వరలో పసిడి తొడుగు అజ్ఞాత భక్తుడిచ్చిన 12కేజీలతో పనులు భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారు త్వరలో పసిడిపూతతో ధగధగ మెరిసిపోనున్నారు. గర్భగుడిలోని మూల మూర్తులకు 12 కేజీల బంగారంతో తొడుగు పనుల ప్రక్రియ శ్రీకారం కాబోతోంది. మరోపక్క ఆలయానికి బంగారం నిల్వలు క్రమే ణా పెరుగుతుండడంతో..భద్రాద్రి రామాలయం అభివృద్ధి వేగమందుకోనుంది. భద్రాచల దేవస్థానం వందేళ్ల ఉత్సవం సందర్భంగా భక్త రామదాసు చేయించిన ఉత్సవమూర్తులకు బంగారు తొడుగు వేయించారు. ఇప్పుడు గర్భగుడిలోని మూలమూర్తులకు సుమారుగా 12 కేజీల బంగారంతో తొడుగు చేయించేందుకు బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ముందుకొచ్చారు. ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు దేవస్థానం అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. అంతా విజయవంతంగా పూర్తయితే భద్రాద్రి రామయ్య..ఇక బంగారు రాముడిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దాతలు సిద్ధం.. ఆదరణ శూన్యం.. దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి కానుకలు ఇచ్చేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. కానీ వారిని ఆదరించి..కానుకలను పొందడంలో ప్రస్తుత దేవస్థానం అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో పాలకమండలి ఉన్న సమయంలో ఇండియా సిమెంట్ అధినేత శ్రీనివాసన్ ద్వారా గర్భగుడిలోని ప్రధాన ద్వారాన్ని బంగారు వాకిలిగా తయారు చేసేందుకని రూ.50 లక్షలు ఇచ్చా రు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో దాతల నుంచి సహకారం అందలేదు. ఆలయాభివృద్ధి కోసం దాతలను ప్రోత్సహించాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు.