balkampeta
-
బల్కంపేట వద్ద లారీ బీభత్సం- ఒకరి మృతి
సనత్‌నగర్ పరిధిలోని బల్కంపేట-బాలానగర్ ప్లైఓవర్ వద్ద ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిలవ్వటంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సంఘటనాస్థలంలోనే మృతిచెందగా..14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలాసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాల మధ్య బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు సమర్పించిన లడ్డూకు వేలం పాట నిర్వహించగా ఫతేనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్ రూ.2 లక్షలకు స్వాధీనం చేసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు
-
బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఆలయ అభివృ఼ద్ధికి మరింత పాటుపడతామని చెప్పారు. కాగా, మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును పరిశీలించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హరితహారం పథకం అమలుచేసే విషయం గురించి పరిశీలించనున్నారు. భారీ ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జోగిని రాధిక