
(ఫైల్ ఫోటో)
సాక్షి,చిత్తూరు: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తల్లి కోరిన కోరికను తీర్చారు. మంత్రి స్వగ్రామమైన ఎర్రతివారిపల్లెలో తమ ఇలవేల్పు సదుం ఎల్లమ్మ ఆలయం శిధిలావస్థలో ఉండటంతో తిరిగి ఆలయాన్ని నిర్మించాలని ఆయన తల్లి పద్మావతమ్మ కోరారు. తల్లి ఆదేశాలతో రెండు నెలల్లో అన్ని హంగులతో ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి పునర్నిర్మించారు. ఆలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు.
చదవండి: ‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర
ఈ కుంభాభిషేకంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు అశోక్ కుమార్, పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వైభవంగా జరిగిన కుంభాభిషేక కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. కుంభాభిషేకంలో ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకట గౌడ, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.