కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది.
కర్నూలు (వెల్దుర్తి) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమారు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి ఆభరణాలను కూడా దోచుకెళ్లారు. వీటి విలువ రూ.15 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.