ఓయోలో వ్యభిచారం.. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకొచ్చి.. | 12 Held For Running Prostitution Racket In Oyo Hotel At Balkampet | Sakshi
Sakshi News home page

ఓయోలో వ్యభిచారం.. తీగ లాగితే డొంక కదిలినట్లు..

Published Fri, Mar 25 2022 12:00 PM | Last Updated on Fri, Mar 25 2022 12:50 PM

12 Held For Running Prostitution Racket In Oyo Hotel At Balkampet - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమీర్‌పేట: ఓయో హోటల్‌ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్‌ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్‌ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు.

రమేష్‌ను విచారించగా తాను జనార్దన్‌ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్‌ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. జనార్దన్‌ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్‌ మీరా, కో ఆర్టినేజర్‌ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.  
చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement