నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ 'సీతారామం' అనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం అమ్మాయి పాత్రలో నటిస్తుండటంతో ఇక హీరోయిన్ రష్మికే అన్న కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ హను క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పాత్రకు తగ్గట్లు రష్మిక ఎంతో కష్టపడిందని, ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment