
దుల్కర్ సల్మాన్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటుడే కాదు మంచి సింగర్ కూడా. ఇది వరకు తన సినిమాల్లో కొన్ని పాటలను తానే పాడారు. ‘ఏబీసీడి, చార్లీ, పరవా’ సినిమాల్లో తన గొంతుని వినిపించారు. తన తండ్రి మమ్ముట్టి నటించిన ‘మంగ్లీష్’ కోసం ఓ పాట పాడారు. లేటెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం ఓ పాట పాడారు. అయితే ఇది తెలుగు పాట కాదు, మలయాళ పాట. ‘డియర్ కామ్రేడ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం మలయాళ పాటను ఇటీవలే రికార్డ్ చేశారట దుల్కర్.