
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు.
Prabhas Grand Entry In Sita Ramam Pre Release Event: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, క్యారెక్టర్ల లుక్స్, పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఘనంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ కార్యక్రమంలో స్టేజ్‌పైకి ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ గ్రాండ్‌గా ఆకట్టుకునేలా ఉంది. డార్లింగ్ ఎంట్రీతో విజిల్స్, అరుపులతో స్టేడియం హోరెత్తింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనుధీప్, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, సుమంత్, అశ్వినీదత్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు.