‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’ | Dulquer Salman Kanulu Kanulanu Dochayante Movie Song Out | Sakshi
Sakshi News home page

‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’

Feb 15 2020 5:08 PM | Updated on Feb 15 2020 5:08 PM

Dulquer Salman Kanulu Kanulanu Dochayante Movie Song Out - Sakshi

తొలి చూపులోనే పడిపోయానే నా బాధను ఎవరికి చెప్పనే
 

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రీతువర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘కన్నుం కన్నుం కొలైయడిత్తాల్‌’. ఇదే చిత్రాన్ని ‘కనులు కనులను దోచాయంటే’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. దేసింగ్‌ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ సినిమాలోని ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’ అంటూ సాగే ప్రేమ పాటను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

మసాల కాఫీ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఈ పాటను కంపోజ్‌ చేయగా రోహిత్‌ పరటాల ఆలపించాడు. సామ్రాట్‌ నాయుడు, పూర్ణచారి చల్లూరి లిరిక్స్‌ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. అంతేకాకుండా విజువల్‌ పరంగా కూడా చాలా అందంగా ఉండటంతో నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది.  దీంతో ప్రస్తుతం ‘గుండె గిల్లి’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్‌కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది.

చదవండి:
రాఖీ బాయ్‌తో కురుప్‌..
పవన్‌ కల్యాణ్‌ ఎంట్రీకి భారీ ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement