సావిత్రి చిన్ననాటి పాత్రలో రాజేంద్రప్రసాద్ మనవరాలు నిశంకర నటిస్తుండగా, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను పాప్ సింగర్ స్మిత కూతురు శివి చేస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను స్మిత సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు. తల్లి సావిత్రి( కీర్తి సురేశ్) , తండ్రి జెమినీ గణేషన్( దుల్కర్ సల్మాన్)తో ఉన్న ఫోటోలను స్మిత షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
సావిత్రి పాత్రకు సంబంధించిన కీర్తి సురేశ్ ఫోటోలను రిలీజ్ చేస్తూ... సినిమాపై అంచనాలను పెంచేస్తోంది చిత్రయూనిట్. కీర్తి సురేశ్, దుల్కర్‌సల్మాన్, సమంత, విజయ దేవరకొండ, షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిక్కి జే మేయర్ స్వరాలు సమకూర్చగా... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
One more with mom & dad 😊 @Shivisayz @KeerthyOfficial @dulQuer #NagAshwin #Mahanati @SwapnaCinema pic.twitter.com/YlhqrrHpIl
— Smita (@smitapop) May 6, 2018
Finally sharing a picture, I guess I can now😊 a moment from the shoot of #Mahanati @Shivisayz with father @dulQuer #Gemini pic.twitter.com/eISKjTBA7w
— Smita (@smitapop) May 4, 2018
Comments
Please login to add a commentAdd a comment