
‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్మాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత సురేశ్ కొండేటి. వినాయక చవితి కానుకగా ఈ నెల 14న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద– ధనిక వర్గాల మధ్య భేదం.. వంటి అంశాలతో తెరకెక్కిన చక్కని ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. కథ,
కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాహితీగారు రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్.