స్ట్రైట్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నా! | Ustad Hotel Malayalam Movie Telugu Remake Is Titled As Jatha hotel | Sakshi
Sakshi News home page

స్ట్రైట్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నా!

Oct 6 2017 1:41 AM | Updated on Oct 6 2017 4:46 AM

Ustad Hotel Malayalam Movie Telugu Remake Is Titled As Jatha hotel

ఇప్పటివరకు నేను అందించిన అనువాద చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. భవిష్యత్‌లోనూ నేనందించే చిత్రాలకు ఇదే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా తెలుగులో స్ట్రైట్‌ ఫిల్మ్‌ నిర్మించాలన్నది నా కల. ఆ కలను త్వరలోనే నెరవేర్చుకుంటా’’ అన్నారు సురేశ్‌ కొండేటి. పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించి,  ‘సంతోషం’ పత్రికాధినేతగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

నేడు సురేశ్‌ కొండేటి పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేశ్‌ మాట్లాడుతూ – ‘‘ప్రేమిస్తే’,  ‘జర్నీ, మహేశ్, ప్రేమించాలి, పిజ్జా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించాను.  దుల్కర్‌ సల్మాన్, నిత్యామీనన్‌ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్‌ హోటల్‌’ను త్వరలో తెలుగులో విడుదల చేయబోతున్నాను. ఈ చిత్రానికి ‘జనతా హోటల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement