ఆ హోటల్‌లో.... | Ustad Hotel Malayalam movie rights taken by SURESH | Sakshi
Sakshi News home page

ఆ హోటల్‌లో....

Published Thu, Jul 9 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

ఆ హోటల్‌లో....

ఆ హోటల్‌లో....

 ఓ  డబ్బున్న యువ కునికి చెఫ్ కావాలని ఆశ. విదేశాల్లో ఉండే అతగాడు ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాతగారు నడుపుతున్న హోటల్‌కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి? చెఫ్ కావాలనుకునే ఆ యువకుడు ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన అమ్మాయి కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’.

మలయాళంలో ఘనవిజయం  సాధించిన ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో  విడుదల చేయనున్నారు.  మణిరత్నం తెరకెక్కించిన  ‘ఓకే బంగారం’తో  తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ కథానాయిక. ‘‘దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌లది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో ‘ఓకే బంగారం’ ఒకటి. ‘ఉస్తాద్ హోటల్’లో వీరి కెమిస్ట్రీ ఓ హైలైట్. ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ బాంధవ్యాలను స్పృశిస్తూ సాగే చిత్రం ఇది. వచ్చే నెల విడుదల చేయనున్నాం’’ అని సురేశ్ కొండేటి  తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement