Ustad Hotel
-
జనతా హోటల్
‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో మంచి జోడీ అనిపించుకున్నారు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్ కొండేటి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం తదితర అంశాలతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ‘మహానటి’ మూవీ తర్వాత దుల్కర్ సల్మాన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు మంచి సంభాషణలు అందించిన సాహితీ ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
స్ట్రైట్ మూవీ ప్లాన్ చేస్తున్నా!
ఇప్పటివరకు నేను అందించిన అనువాద చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. భవిష్యత్‌లోనూ నేనందించే చిత్రాలకు ఇదే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ నిర్మించాలన్నది నా కల. ఆ కలను త్వరలోనే నెరవేర్చుకుంటా’’ అన్నారు సురేశ్ కొండేటి. పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి, ‘సంతోషం’ పత్రికాధినేతగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నేడు సురేశ్ కొండేటి పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ – ‘‘ప్రేమిస్తే’, ‘జర్నీ, మహేశ్, ప్రేమించాలి, పిజ్జా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించాను. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ను త్వరలో తెలుగులో విడుదల చేయబోతున్నాను. ఈ చిత్రానికి ‘జనతా హోటల్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని చెప్పారు. -
అందమైన ప్రేమకథ
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ది హిట్ పెయిర్. మలయాళంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలతో పాటు తెలుగులో చేసిన ‘ఓకే బంగారం’ ఘనవిజయం సాధించాయి. ఈ ఇద్దరూ నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్కే పిక్చర్స్ పతాకంపై ‘జతగా’ పేరుతో నిర్మాత cవిడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ- ‘‘పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను స్పృశిస్తూ తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. సున్నితమైన భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంటుంది. యువతకి, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. గోపీసుందర్ పాటలు మా చిత్రానికి ప్లస్. మలయాళంలో ‘ఉస్తాద్ హోటల్’కి జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
ఆ హోటల్లో....
ఓ డబ్బున్న యువ కునికి చెఫ్ కావాలని ఆశ. విదేశాల్లో ఉండే అతగాడు ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాతగారు నడుపుతున్న హోటల్‌కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి? చెఫ్ కావాలనుకునే ఆ యువకుడు ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన అమ్మాయి కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేయనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ కథానాయిక. ‘‘దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్లది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో ‘ఓకే బంగారం’ ఒకటి. ‘ఉస్తాద్ హోటల్’లో వీరి కెమిస్ట్రీ ఓ హైలైట్. ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ బాంధవ్యాలను స్పృశిస్తూ సాగే చిత్రం ఇది. వచ్చే నెల విడుదల చేయనున్నాం’’ అని సురేశ్ కొండేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్.