అందమైన ప్రేమకథ | Ustad Hotel named Jathaga in Telugu | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమకథ

Published Wed, Oct 5 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

అందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ది హిట్ పెయిర్. మలయాళంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలతో పాటు తెలుగులో చేసిన ‘ఓకే బంగారం’ ఘనవిజయం సాధించాయి. ఈ ఇద్దరూ నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్‌కే పిక్చర్స్ పతాకంపై ‘జతగా’ పేరుతో నిర్మాత cవిడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ- ‘‘పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను స్పృశిస్తూ తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. సున్నితమైన భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంటుంది.

యువతకి, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. గోపీసుందర్ పాటలు మా చిత్రానికి ప్లస్. మలయాళంలో ‘ఉస్తాద్ హోటల్’కి జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement