జనతా హోటల్‌ | Usthad hotel movie relaese this month | Sakshi
Sakshi News home page

జనతా హోటల్‌

Published Tue, Jul 10 2018 12:34 AM | Last Updated on Tue, Jul 10 2018 12:34 AM

Usthad hotel movie relaese this month - Sakshi

దుల్కర్‌ సల్మాన్, నిత్యామీనన్‌

‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో మంచి జోడీ అనిపించుకున్నారు దుల్కర్‌ సల్మాన్, నిత్యామీనన్‌. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌ హోటల్‌’. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం వహించారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్‌ కొండేటి. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత  సురేశ్‌ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం తదితర అంశాలతో రూపొందిన చక్కని ఫీల్‌ గుడ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మలయాళంలో మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ‘మహానటి’ మూవీ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్‌’ చిత్రాలకు మంచి సంభాషణలు అందించిన సాహితీ ‘జనతా హోటల్‌’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్‌ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. లోకనాథన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement