నేనేం చేస్తున్నానంటే...! | Vijay Deverakonda Accepts BeTheREALMAN Challenge | Sakshi
Sakshi News home page

నేనేం చేస్తున్నానంటే...!

Published Sun, Apr 26 2020 6:00 AM | Last Updated on Sun, Apr 26 2020 6:00 AM

Vijay Deverakonda Accepts BeTheREALMAN Challenge - Sakshi

తల్లి, తమ్ముడితో విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తారు. ప్రస్తుతం అందరూ ‘‘బి ది రియల్‌ మేన్‌ ఛాలెంజ్‌’’ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు పనుల్లో సహాయం చేస్తూ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే ఈ ఛాలెంజ్‌. విజయ్‌ను దర్శకుడు కొరటాల శివ ఈ ఛాలెంజ్‌కి ఎంపిక చేశారు. ‘‘రియల్‌ మేన్‌ ఛాలెంజ్‌ చేద్దాం అంటే మా అమ్మ నన్ను ఏ పనీ చేయనీయడం లేదు. అందుకే ఈ లాక్‌ డౌన్‌లో ఏం చేస్తున్నానో చూపిస్తాను’’  అన్నారు విజయ్‌.

ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం, బాటిల్స్‌లో నీళ్లు నింపడం, మామిడి పండుతో ఐస్‌ క్రీమ్‌ చేయడం, వీడియో గేమ్స్‌ ఆడటం వంటి పనులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు విజయ్‌. ఈ వీడియోను విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ షూట్‌ చేశారు. ఈ వీడియోలో తన తండ్రిని చూపిస్తూ ‘ది రియల్‌ మేన్‌’ అని విజయ్‌ పేర్కొనడం విశేషం. ఈ ఛాలెంజ్‌కు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ని నామినేట్‌ చేశారు విజయ్‌ దేవరకొండ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement