
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment