ప్రభాస్ కొత్త మూవీలో పాకిస్థాన్ నటి కూడా! | Pakistani Actress Sajal Aly In Prabhas-Hanu Next Movie | Sakshi
Sakshi News home page

Prabhas Hanu: ఇమాన్వీతో పాటు పాక్ బ్యూటీ కూడా!

Published Wed, Aug 21 2024 1:18 PM | Last Updated on Wed, Aug 21 2024 1:23 PM

Pakistani Actress Sajal Aly In Prabhas-Hanu Next Movie

'కల్కి'తో హిట్ కొట్టిన ప్రభాస్.. కొత్త సినిమా కూడా మొదలుపెట్టేశాడు. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. మొన్ననే పూజ జరగ్గా.. ఈ నెలలోనే షూటింగ్ ఉండొచ్చు. ఇక ఈ మూవీతో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఇందులోనే మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, అందుకోసం పాక్ బ్యూటీని తీసుకుంటారని తెలుస్తోంది. ఇది రూమర్ కాదు, నిజమేనని సమాచారం.

(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్)

ప్రభాస్-హను మూవీ లాంచ్‌కి ముందు కొన్ని గాసిప్స్ వచ్చాయి. 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, ఇందులో పాన్ నటి సాజల్ అలే హీరోయిన్ అని అన్నారు. కట్ చేస్తే దిల్లీలో పుట్టి అమెరికాలో ఉంటున్న ఇమాన్వీ అనే అమ్మాయి.. ప్రభాస్‌తో కలిసి సినిమా లాంచింగ్ రోజు కనిపించింది. దీంతో పాక్ నటిది గాసిప్ అనుకున్నారు. కానీ ఈమె రోల్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే అనౌన్స్ చేసేవరకు అది గోప్యమేనట.

2017లో వచ్చిన 'మామ్' సినిమాలో సాజల్.. శ్రీదేవి కూతురిగా నటించింది. అంతకుముందు కుచ్ అంఖహి, యాఖిన్ క సఫర్, హే దిల్ మేరా తదితర పాక్ సినిమాలు, టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 1940 బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రభాస్ సినిమా తీస్తున్నారని, ఇందులో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు!

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement