హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు | Kiran Abbavaram Wedding Pics And Details | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: పెళ్లి పనులు మొదలు.. ఫొటోలు షేర్ చేసిన రహస్య

Published Wed, Aug 21 2024 7:30 AM | Last Updated on Wed, Aug 21 2024 11:24 AM

Kiran Abbavaram Wedding Pics And Details

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఆగస్టు 22న అంటే గురువారం జరగనుంది. కర్ణాటకలోని కూర్గ్‌లో ఈ వేడుకని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అక్కడికి చేరుకున్న పెళ్లి బృందం.. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహానికి ముందు జరిగే శుభకార్యాల్లో కాబోయే వధూవరులిద్దరూ కాస్తంత బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కిరణ్ కాబోయే భార్య రహస్య షేర్ చేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)

'రాజావారు రాణిగారు' సినిమాతో కిరణ్-రహస్య ఒకరికొకరు పరిచయం. ఆ తర్వాత కిరణ్.. ఒక్కో సినిమా చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. రహస్య మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయి ఉద్యోగం చేసుకుంటోంది. ఇక తొలి మూవీ చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఈ ఏడాది నిశ్చితార్థం జరిగే వరకు బయటపెట్టలేదు.

ఇక కూర్గ్‌లోనే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే.. పెళ్లి కూతురు రహస్య బంధువులంతా అక్కడే ఉండటంతో ఆ ఊరిలో పెళ్లి ఏర్పాటు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఇండస్ట్రీలోని స్నేహితులకు హైదారాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారేమో?

(ఇదీ చదవండి: ఐదు నిమిషాల పాటకి కోటి రూపాయలు తీసుకున్న తమన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement