తమన్నా ‘స్పెషల్‌’ : ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు? | Tamanna Bhatia Charge Huge Remuneration For Stree 2 Movie Special Song | Sakshi
Sakshi News home page

Tamanna Bhatia: ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు.. దటీజ్‌ తమన్నా

Published Tue, Aug 20 2024 5:35 PM | Last Updated on Tue, Aug 20 2024 6:15 PM

Tamanna Bhatia Charge Huge Remuneration For Stree 2 Movie Special Song

ఏ సినిమాకు అయినా పాటలు ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనం మాములుగా ఉన్నా.. పాటలతోనే హిట్‌ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక స్పెషల్‌ సాంగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు హైప్‌ తీసుకురావడంతో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ దర్శకులు సైతం స్పెషల్‌ సాంగ్‌పై స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారు. 

(చదవండి: సమంత సర్‌ప్రైజ్‌.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!)

స్టార్‌ హీరోయిన్లతో స్టెప్పులేయిస్తే.. కాసుల వర్షం కురుస్తుందని భావిస్తారు. అయితే నిజంగానే కొన్ని సినిమాలకు స్పెషల్‌ సాంగ్‌ బాగా కలిసొస్తుంది. అలా ఇటీవల స్పెషల్‌ సాంగ్‌తో భారీ హైప్‌ క్రియేట్‌ చేసుకున్న సినిమా స్త్రీ 2. రాజ్‌ కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన ఈ హారర్‌ ఫిల్మ్‌ ఆగస్ట్‌ 15న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేసింది.

(చదవండి: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో)

 ‘ఆజ్‌ కి రాత్‌’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్‌ అయ్యాయి. సినిమాకు హైప్‌ తీసుకొచ్చిన అంశాల్లో ఈ పాట కూడా ఒకటి. అయితే స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట. కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కారణంగానే ఆ స్పెషల్‌ సాంగ్‌కి హైప్‌ వచ్చిందని..అది సినిమాకు బాగా ప్లస్‌ అయిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాంగ్‌ నోరా ఫతేహీ చేయాల్సింది. స్త్రీ పార్ట్‌ 1లో ఆమే ఐటమ్‌ సాంగ్‌ చేసింది. పార్ట్‌ 2 లో నోరానే చేయాల్సింది కానీ.. చివరి నిమిషంలో తమన్నాను సంప్రదించారట మేకర్స్‌. వాళ్లు తీసుకున్న నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement