ప్రభాస్‌- హను సినిమా కార్యక్రమంలో పాల్గొన్న స్టార్స్‌.. వీడియో వైరల్‌ | Prabhas And Hanu Raghavapudi Movie Pooja Event Video | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌- హను సినిమా కార్యక్రమంలో పాల్గొన్న స్టార్స్‌.. వీడియో వైరల్‌

Published Sun, Aug 18 2024 9:53 AM | Last Updated on Sun, Aug 18 2024 12:17 PM

Prabhas And Hanu Raghavapudi Movie Pooja Event Video

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమాని గుల్షన్‌ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, ప్రశాంత్‌ నీల్‌, బుచ్చిబాబుతో పాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మేకర్స్‌ షేర్‌ చేశారు.

‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్‌ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్‌ కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్‌ఫుల్‌ వారియర్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.  ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిధున్‌ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్‌ ఛటర్జీ ఐఎస్‌సీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement