ప్రభాస్‌ కొత్త సినిమా పోస్టర్‌ విడుదల | Prabhas And Hanuraghavpudi New Movie Poster Out Now | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

Published Sat, Aug 17 2024 6:52 PM | Last Updated on Sat, Aug 17 2024 7:49 PM

Prabhas And Hanuraghavpudi New Movie Poster Out Now

పాన్‌ ఇండియా రేంజ్‌లో వరుస సినిమాలతో  ప్ర‌భాస్ హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్‌గా కల్కి సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద రూ. 1200 కోట్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌.. తాజాగా మరో సినిమాను ‍ప్రకటించాడు.  డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడితో మూవీ లాంఛింగ్‌ కార్యక్రం తాజాగా జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

ప్ర‌భాస్‌, హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. పూర్తిస్థాయి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ షేర్‌ చేసింది.  1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్‌లో తెలిపింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ చిత్రంగా తెరకెక్కనుందని మేకర్స్‌ తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్‌లో చూపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కోసం విశాల్ చంద్రశేఖర్‌  మూడు పాటలు కూడా కంపోజ్‌ చేసినట్లు డైరెక్టర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement