దసరాకి ఖుషీ | Shooting updates of Prabhas Fauji | Sakshi
Sakshi News home page

దసరాకి ఖుషీ

Published Sat, Sep 21 2024 1:16 AM | Last Updated on Sat, Sep 21 2024 1:16 AM

Shooting updates of Prabhas Fauji

దసరా పండగకి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారట ప్రభాస్‌. అది కూడా గ్లింప్స్‌ రూపంలో. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజా సాబా’లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమా అంగీకరించారు. ‘స్పిరిట్‌’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట.

ఘను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా షూట్‌ ఆరంభమైంది. మధురైలో ఫస్ట్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్‌ నుంచి పాల్గొంటారట. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట. 1940ల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే మార్చికి పూర్తవుతుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement