‘స్పిరిట్‌’ డిసెంబరులో స్టార్ట్‌ | Prabhas Spirit Movie Update | Sakshi
Sakshi News home page

‘స్పిరిట్‌’ డిసెంబరులో స్టార్ట్‌

Published Wed, Nov 13 2024 12:33 AM | Last Updated on Wed, Nov 13 2024 12:38 AM

Prabhas Spirit Movie Update

‘స్పిరిట్‌’ సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్‌’. ఈ చిత్రం కోసం తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నాడు ప్రభాస్‌. కాగా తాజాగా ‘స్పిరిట్‌’ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ స్పందించారు.

‘‘స్పిరిట్‌’ ప్రారంభోత్సవం ఈ ఏడాది డిసెంబరులో ప్లాన్‌ చేస్తున్నాం. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఈ మూవీని సెట్స్‌కు తీసుకువెళ్తాం. 2026 మధ్యలో రిలీజ్‌ ఉండొచ్చు. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి    ‘స్పిరిట్‌’ సాంగ్స్‌ పనుల్లో ఉన్నారు. నేను రెండు సాంగ్స్‌ విన్నాను.. బాగున్నాయి’’ అని ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భూషణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement