ఎస్‌... జోడీ కుదిరింది | Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi | Sakshi
Sakshi News home page

ఎస్‌... జోడీ కుదిరింది

Published Fri, Dec 29 2017 12:55 AM | Last Updated on Fri, Dec 29 2017 12:55 AM

Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi - Sakshi

సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ శర్వానంద్, సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సాయి పల్లవి..ఈ ఎస్‌ అండ్‌ ఎస్‌ జోడీ కుదిరింది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శర్వానంద్, సాయి పల్లవి, హను రాఘవపూడి వంటి ముగ్గురు ప్రతిభావంతులతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది.

హను ఓ హిలేరియస్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ స్టోరీ రెడీ చేశారు. ఈ అందమైన ప్రేమకథలో శర్వానంద్, సాయి పల్లవిల జంట చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ను జనవరి మూడో వారంలో మొదలుపెడతాం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement