Sita Ramam Movie Collects Rs.75 Crores At Worldwide Box Office Collections Till Now - Sakshi
Sakshi News home page

Sita Ramam: సీతారామం సినిమా అన్ని కోట్లు వసూలు చేసిందా?

Published Sat, Aug 27 2022 6:42 PM | Last Updated on Sat, Aug 27 2022 8:34 PM

Sita Ramam Collects Rs.75 cr Worldwide - Sakshi

అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమా సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్‌ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి.

సి.అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్‌పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్‌ డాలర్స్‌ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్‌.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా?
ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement