
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది.
(ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?)
'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది'
తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే)
Comments
Please login to add a commentAdd a comment