సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం.
చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’
యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్‌ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను.
అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు.
చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్
అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment