అఖిల్ రెండో సినిమా ప్రకటించేశాడు..! | Akhil second movie with Hanu raghavapudi | Sakshi
Sakshi News home page

అఖిల్ రెండో సినిమా ప్రకటించేశాడు..!

Published Thu, Jul 28 2016 9:06 AM | Last Updated on Wed, Aug 29 2018 9:26 PM

అఖిల్ రెండో సినిమా ప్రకటించేశాడు..! - Sakshi

అఖిల్ రెండో సినిమా ప్రకటించేశాడు..!

దాదాపు పది నెలల తరువాత అఖిల్ తన రెండో సినిమాను కన్ఫామ్ చేశాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ వారసుడు తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తొలి సినిమాలోనే తన వయసుకు మించిన మాస్ యాక్షన్లను తలకెత్తుకున్న అక్కినేని అందగాడు అభిమానులను నిరాశపరిచాడు.

దీంతో రెండో సినిమా విషయంలో చాలా కసరత్తులు చేశాడు అఖిల్. వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను... ఇలా స్టార్ డైరెక్టర్లందరి పేర్లు వినిపించినా.. ఫైలన్గా ఓ యువ దర్శకుడితో పనిచేసేందుకు ఓకె చెప్పాడు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి, తరువాత కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్నాడు.

ఈ క్లాస్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement