
శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దాదాపు 70 రోజుల పాటు కోల్‌కతాలోని వివిధ లోకేషన్లలో దాదాపు 70 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలో నేపాల్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కోల్‌కతా షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కోల్‌కతా షెడ్యూల్ లో చిత్రీకరించాము. సినిమా బాగా వస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నార’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment