ఇక షురూ | Fauji Shoot Plans: Hanu Raghavapudi and Prabhas Next Movies | Sakshi
Sakshi News home page

ఇక షురూ

Published Sat, Aug 3 2024 12:24 AM | Last Updated on Sat, Aug 3 2024 12:24 AM

Fauji Shoot Plans: Hanu Raghavapudi and Prabhas Next Movies

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. ‘ఫౌజి’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ చిత్రంలోని హీరోయిన్‌పాత్రకు మృణాల్‌ ఠాగూర్,పాకిస్తాన్‌ నటి సజల్‌ అలీని అనుకుంటున్నారనీ ప్రచారం జరుగుతోంది.

ఈ నెల మూడో వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని, ఆ వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని, మూడుపాటల పని కూడా పూర్తయిందని ఆ మధ్య హను రాఘవపూడి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement