
‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు’ అంటూ ‘లంకేశ్వరుడు’ సినిమాలో చిరంజీవి–రాధ చేసిన సందడి అంత సులువుగా మరచిపోలేరు. అది సరే.. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. దానికి కారణం లేకపోలేదు.. శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకి ‘పడి పడి లేచే వయసు’ అనే టైటిల్ పెట్టనున్నారట.
అదీ సంగతి.. ‘మహానుభావుడు’ వంటి హిట్ తర్వాత సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తర్వాతి సినిమానూ లైన్‌లో పెట్టేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పడి పడి లేచే వయసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వాకి జోడీగా సాయిపల్లవిని ఖరారు చేశారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment