ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’
ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం
ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment