Sita Ramam: Gautham Menon As Major Selvan First Look Out From Movie - Sakshi
Sakshi News home page

Sita Ramam First Look:'సీతారామం' నుంచి 'మేజర్ సెల్వన్‌' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌..

Published Fri, Jul 15 2022 7:42 PM | Last Updated on Fri, Jul 15 2022 8:07 PM

Sita Ramam: Gautham Menon As Major Selvan First Look Out - Sakshi

Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. 

ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్‌ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్‌ లుక్‌ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ పాత్రను రివీల్‌ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్‌ 'మేజర్‌ సెల్వన్‌'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ విడుదల కాగా, సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

చదవండి: అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్‌.. యాంకర్‌పై ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement