
వైవిధ్యమైన ప్రేమకథ
అఆ’ వంటి హిట్ తర్వాత మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నారు నితిన్. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’
‘అఆ’ వంటి హిట్ తర్వాత మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నారు నితిన్. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రాల ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మరో నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు.
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ పూజ అనంతరం స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ- ‘‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దుతాం. వచ్చే వేసవిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి.