2017లో అన్నీ పెద్ద హీరోల సినిమాలే చేశారు. 2018లో యంగ్ హీరోస్‌తో చేశారు. ఇది కాజల్ 2.0నా? అని అడగ్గా– ‘‘ ఇది ప్లాన్ కాదు. కానీ కొత్త సినిమాల్లో కనిపించాలనుకోవడంలో భాగమే. యంగ్ టాలెంట్, కొత్త ఐడియాలతో వర్క్ చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాల్లో కూడా కనిపించాలి. కొత్త తరహా సినిమాలూ చేయాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ఆ బ్యాలెన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు (నవ్వుతూ).
‘‘ప్రతి సినిమాలో మన పాత్రలో ఏదో ఓ స్పెషాలిటీ ఉంటుందని సినిమాను ఎంచుకోము. కొన్ని సార్లు మన పాత్ర కంటే కూడా సినిమా మొత్తంగానే డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి సినిమానే ‘కవచం’. అందుకే ఈ సినిమా చేశాను’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. నవీన్ శొంటినేని నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ చెప్పిన విశేషాలు...
►నా ఇన్నేళ్ల కెరీర్ (పదకొండేళ్లు) లో నేను డిఫరెంట్ జానర్ సినిమాలు చేసింది చాలా తక్కువ. అయితే ఇప్పుడు కేవలం నేను పోషించే పాత్రలే కాదు సినిమా కూడా సరికొత్తగా ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం అలాంటి ఫేజ్‌లో ఉన్నాను. ఎంత కమిటెడ్‌గా ఉన్నాం అన్న దాన్నిబట్టే కెరీర్‌లో ఎక్కువ సంవత్సరాలు కొనసాగుతాం అనుకుంటున్నా.
►‘కవచం’ పూర్తి స్థాయి థ్రిల్లర్. లవ్‌స్టోరీ ఉన్నా కూడా సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమా నడిచే స్పీడ్ అన్నీ కొత్తగా ఉంటాయి. అది నన్ను ఎగై్జట్ చేసింది. తర్వాతేం జరుగుతుంది? అని ఆడియన్స్ కచ్చితంగా ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది.
►ఇంతకు ముందు కూడా డిఫరెంట్ సినిమాలకు ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు నేను నా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయాను. కొత్తవి చేయాలంటే కొంచెం భయపడ్డాను. కానీ ఆ భయాన్ని పోగొట్టేశాను. దర్శకులు కొత్త పాత్రలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు యాక్టర్‌గా వచ్చిన గ్రోత్ వల్లే కొత్త క్యారెక్టర్స్ ఒప్పుకోవడానికి వెనకాడటంలేదు. సెక్యూరిటీ, సేఫ్టీ వస్తేనే ప్రయోగాలు చేయడానికి సంకోచించం. నమ్మకం వచ్చే వరకూ పాత దారిలో నడవాల్సిందే.
►సాయి శ్రీనివాస్ స్వీట్ పర్సన్. తనని ‘ఎంతూ (ఉత్సాహపూరిత) కట్లెట్’ అని పిలుస్తుంటా. చాలా ఉత్సాహపరుడు. విపరీతంగా కష్టపడతాడు. ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతుంటాడు. తనని చూస్తుంటే నన్ను నేను చూస్తున్నట్టు అనిపిస్తుంది.
►ఈ ఏడాది మొదలైనప్పుడు ఈ సంవత్సరం స్లో అయిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే ఆరోగ్య సమస్యలతో (ఆటో ఇమ్యూన్ డిజార్డర్) మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి రిలాక్స్ అవుదాం అనుకున్నాను. విచిత్రం ఏంటంటే నేను బిజీగా పనిచేసింది ఈ సంవత్సరమే. బ్రేక్ కూడా తీసుకోవడానికి కుదర్లేదు.
►మోస్ట్ పవర్‌ఫుల్ చేంజ్ మేకర్ కాజల్ అని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. విచిత్రమేంటంటే పవర్ కావాలని అందరూ కోరుకుంటారు. ఉన్నవాళ్లకు ఎలా ఉపయోగించాలో తెలియదు. నాకున్న పవర్‌తో సొసైటీకి ఏదైనా ఉపయోగపడేవి, ప్రభావితం చేసే పనులు చేయాలనుకుంటా. మనకి వచ్చిన పవర్‌తో సమాజానికి తిరిగవ్వడమే అని నా నమ్మకం.
►‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’ చేస్తున్నాను. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ‘ఇండియన్ 2’ గురించి సూపర్ ఎగై్జటెడ్‌గా ఉన్నాను. తమిళ చిత్రం ‘కోమలి’లో ఫుల్ కామెడీ రోల్ చేస్తున్నాను. తేజగారితో చేసే సినిమాలో ‘ఇంటెన్స్’ ఉన్న పాత్ర చేస్తున్నాను. అందులో కూడా సాయి శ్రీనివాసే హీరో. కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు.
ఓ సంస్థ ద్వారా అరకులో ఆదివాసి పిల్లల్ని చదివిస్తున్నా. కొన్నేళ్ల క్రితం ఓ స్కూల్ కూడా కట్టించాం. అప్పుడప్పుడు వాళ్లు ‘కాజల్ అక్కా..’ అంటూ కొన్ని వీడియోలు పంపుతుంటారు. అవి చూసినప్పుడు మంచి పని చేస్తున్నామనే సంతృప్తి కలుగుతుంది. సొసైటీలో చాలా మంచి దాగి ఉంది. దాన్ని కరెక్ట్‌గా టచ్ చేస్తే అదే బయటకు వస్తుంది. ఈ ఏడాది పెళ్లిళ్ల సంవత్సరం అయిపోయింది. మనం కూడా పెళ్లి చేసేసుకుందామా? అనిపించింది. (నవ్వుతూ).
Comments
Please login to add a commentAdd a comment