
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కవచం. సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మామిల్ల దర్శకుడు. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆ సినిమా ఆన్‌లైన్ మాత్రం సత్తా చాటుతోంది.
సోమవారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. ఇన్స్‌పెక్టర్ విజయ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను 24 గంటల్లోనే కోటీ 60 లక్షల మందికిపైగా వీక్షించారు. మాస్ యాక్షన్ సినిమా కావటంతో పాటు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటించటంతో బాలీవుడ్ ప్రేక్షకులు కవచం డబ్బింగ్ వర్షన్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment