ముచ్చటగా మూడోసారి..! | Kajal Aggarwal To Team up With Bellamkonda Sai Sreenivas Once Again | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 6 2018 12:25 PM | Last Updated on Thu, Dec 6 2018 12:25 PM

Kajal Aggarwal To Team up With Bellamkonda Sai Sreenivas Once Again - Sakshi

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కవచం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్‌ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఈ జంటే కనువిందు చేయనుంది.

అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ రెండు మాత్రమే కాదు మరో సినిమాలో కూడా ఈ జంట కలిసి నటించేందుకు ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి డిటెయిల్స్‌ బయటకు రాకపోయినా.. ముచ్చటగా మూడోసారి స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు శ్రీనివాస్‌, కాజల్‌లు రెడీ అవుతున్నట్టుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement