
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం కవచం. మామిళ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌నే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే అనుకున్నట్టుగా కవచం డిసెంబర్‌లో విడుదల కావటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
కారణాలు బయటకు రాకపోయినా సినిమా వాయిదా పడటం మాత్రం కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే జనవరి నెలాఖరు వరకు పెద్ద సినిమాలు పోటిలో ఉన్నాయి. దీంతో కవచం జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.