బెల్లంకొండ కొత్త సినిమా ‘కవచం’ | Bellamkonda Sai Sreenivas New Movie Kavacham | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 9 2018 12:00 PM | Last Updated on Fri, Nov 9 2018 12:00 PM

Bellamkonda Sai Sreenivas New Movie Kavacham - Sakshi

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో భారీ హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. స్టార్‌ డైరెక్టర్లతో భారీ బడ్జెట్‌ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్‌ తాజాగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పూర్తి చేశాడు శ్రీనివాస్. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

కవచం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మాస్‌ యాక్షన్‌ హీరోగా కనిపించనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపించనున్నాడు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లోనే ఈ విషయాన్ని రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement