నాగశౌర్య, మెహరీన్
నాగశౌర్య కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯ŒŒ్స బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రబృందం. అందులో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ‘నిన్నే నిన్నే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘‘ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, మోషన్ పోస్టర్స్‌తో పాటు ‘నిన్నే నిన్నే..’ తొలి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగశౌర్య మంచి కథను అందించాడు. ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు శౌర్య. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి.
Comments
Please login to add a commentAdd a comment