
మెహరీన్, తమన్నా, వెంకటేశ్, అనిల్ రావిపూడి
ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు ‘ఎఫ్ 2 ఫ్యామిలీ’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘తొలి షెడ్యూల్ కంప్లీట్ చేశాం. వెంకటేశ్‌గారు అమేజింగ్. బ్రదర్ వరుణ్ తేజ్ లాస్ట్‌డే మిస్ అయ్యాడు కానీ సెట్‌లో రాకింగ్ పెర్ఫార్మెన్స్. తమన్నా మీ ఆన్‌స్క్రీన్ సిస్టర్ మోహరీన్‌ను జాగ్రత్తగా చూసుకోండి. మళ్లీ మీరు ఇద్దరు కలుస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
‘‘ఫస్ట్ షెడ్యూల్‌లో లాస్ట్ డే మిస్సయ్యాను. వెంకటేశ్‌గారు, అందరితో నటించడం ఆనందంగా ఉంది. సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఎఫ్ 2’ షూటింగ్‌లో ఫన్ అన్‌లిమిటెడ్. అనిల్ సర్ దర్శకత్వంలో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మెహరీన్‌ని నేను కలిసినప్పుడు తప్పకుండా మీకు ఆ ఫొటోలు పంపిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడు అల్లుళ్ల పాత్రలో నటిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని హింట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
వెంకటేశ్, వరుణ్ తేజ్
Comments
Please login to add a commentAdd a comment