
కల్యాణ్‌రామ్
ఆదిత్య మ్యూజిక్.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్రవేసిన ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెలుగులో తొలి సినిమా నిర్మించనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణ్‌రామ్‌కి జోడీగా మెహరీన్ నటించనున్నారు. ‘జెంటిల్‌మన్, సమ్మోహనం’ వంటి హిట్‌చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. ‘గీత గోవిందం, మజిలీ’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న గోపీసుందర్ ఈ సినిమాకి స్వరకర్త. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వేగేశ్న సతీష్ కథను సిద్ధం చేసుకున్నారు’ అని చిత్రనిర్మాత ఉమేష్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment