గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ | sudheer babu, mehreen new movie launch | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ

Published Sat, Aug 18 2018 12:11 AM | Last Updated on Sat, Aug 18 2018 12:11 AM

sudheer babu, mehreen new movie launch - Sakshi

సుధీర్‌బాబు, మెహరీన్‌పై క్లాప్‌ ఇస్తున్న ‘దిల్‌’ రాజు

‘సమ్మోహనం’ హిట్‌ తర్వాత సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సుధీర్‌ బాబు, మెహరీన్‌ జంటగా పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రిజ్వాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్‌ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, నరేష్‌ వీకే, పోసాని కృష్ణమురళి,  ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఖుర్షీద్‌ (ఖుషి), సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్, కెమెరా: పి.వి శంకర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement