Paruchuri Gopalakrishna
-
అహం.. అలా చేసుంటే ఇంకా బాగుండేది: పరుచూరి
ఒకే ఒక్క క్యారెక్టర్.. గంటన్నర సినిమా.. సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ అహం- రీబూట్. ఆహాలో రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమాపై దర్శకరచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇచ్చారు.అలా చేసుంటే..ఆయన మాట్లాడుతూ.. రేడియో జాకీగా పని చేసే ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒకే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం. ఇందులో సోలోమ్యాన్ షోలా కాకుండా ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఇంకా బాగా చూసేవారు.తాపత్రయం బాగుంటుందిసినిమా గురించి మరింత మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకరిని కోల్పోయినందుకు చనిపోదామనుకునే దశ నుంచి దాన్నుంచి బయటపడటం అనేది మంచి సందేశం. తన జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదని హీరో పడే తాపత్రయం బాగుంటుంది. చిన్నచిన్న సమస్యలకే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మంచిది కాదని సినిమాలో చక్కగా చెప్పారు.ప్రయోగాలు ఆపకూడదునూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూడాలి. కొన్నిసార్లు ప్రయోగాలు అద్భుత విజయాలను సాధిస్తాయి. మరికొన్నిసార్లు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాం కదా అని ప్రయోగాలు ఆపకూడదు అని పేర్కొన్నారు. కాగా సుమంత్ హీరోగా నటించిన అహం మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించాడు. -
‘గుంటూరు కారం’లో అది మిస్ అయింది.. ఈ టైటిల్ పెడితే బాగుండేది: పరుచూరి
మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది మహేశ్ బాబు రేంజ్ సినిమా కాదని, త్రివిక్రమ్ బలమైన కథను రాసుకోలేకపాయడనే విమర్శలు కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న గుంటూరు కారం చిత్రంపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇది మహేశ్ బాబు స్థాయి సినిమా కాదని, టైటిల్ కూడా అలా పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘350 చిత్రాలకు పైగా పని చేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్ఫ్యూజ్గా అనిపించింది.ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్ చుట్టు ఈ కథ అల్లుకున్నాడు. అయితే ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ పండలేదు. అలాగే తాత మనవళ్ల సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. హీరో అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. అని పరుచూరి అభిప్రాయ పడ్డాడు. -
బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్.. 'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్‌తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్ మేకప్ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు. ఇంటర్వెల్లో విరాజ్‌కు ముద్దు.. కానీ సెకండాఫ్ ప్రారంభంలో.. హీరో ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ వైష్ణవికి కొత్త ఫోన్ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్ ఐఫోన్ కొనిస్తాడో అప్పుడు ఆనంద్ ఇచ్చిన మొబైల్‌ను డబ్బా ఫోన్ అనేస్తుంది హీరోయిన్. దీంతో అతడు ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్‌నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్.. హీరోయిన్ విరాజ్‌కు కిస్ ఇస్తుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్ మీదే ఉందని అర్థమవుతుంది. హీరోయిన్‌కు చెడ్డ సలహా.. అయితే విరాజ్ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్‌కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్ గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఈ పాయింట్‌తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్‌తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది. హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్ విరాజ్‌కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్‌కు తగ్గట్లుగా హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్‌ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: పుష్పరాజ్ దెబ్బ.. సెకండ్ పార్ట్‌కు రూ.1000 కోట్ల డీల్..! -
నా వల్ల మా అన్నయ్య జైలుకు పోయేవాడు..
-
రష్మికను కేవలం పాటల కోసమే వాడుకున్నారు: పరుచూరి
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'హీరోను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ అద్భుతంగా ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసిన విజయ్, వంశీలను అభినందించాలి. పెద్దింటి పేరెంట్స్‌కు ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి ఇంటికి తీసుకొచ్చే తమ్ముడి కథ ఇది. హీరో అమ్మచాటు బిడ్డ. కానీ నాన్న కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తండ్రి బతికే అవకాశం లేదని తెలిసినప్పుడు మూడో కొడుకును తన స్థానంలో హెడ్‌గా కూర్చోబెడతాడు. దీంతో కోపంతో మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి బారి నుంచి కాపాడాలంటే చిన్నవాడే బెటర్ అనుకుంటాడు తండ్రి. ఎందుకంటే అప్పటికే పెద్ద కొడుకు శ్రీకాంత్‌కు ఒకరితో ఎఫైర్ ఉంటుంది. రెండో కుమారుడు సొంత కుటుంబానికే ద్రోహం చేయాలని చూస్తాడు. 2.49 గంటల సినిమాలో ప్రేమ చాలా తక్కువగా ఉంది. పాటల కోసం రష్మికను వాడుకున్నారు. ఉమ్మడి వ్యవస్థ, కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు.. వీటికి ఎక్కువ నిడివి ఇచ్చారు. దాన్ని కొంచెం కట్ చేసి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎక్కువ చూపించి ఉంటే బాగుండేది. ఓ సీన్లో విజయ్ను చైర్మన్‌గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు విజయ్ ఓటేసేవాళ్ల తప్పులను ఎత్తిచూపడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకే ఓటేస్తారు. ఆ సీన్ బాగుంది. వందమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా వేయడడు. మరొకటి.. తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడతాడు. అయితే ఒకానొక దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్లుగా ఉంటే హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకొచ్చేస్తాడు. లెవంత్ అవర్‌లో తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. అంతా బాగుంది కానీ ఆ షాట్ చూపించకపోయుంటే బాగుండేది. అస్థికలు కలిపినట్లు కాకుండా హీరోయిన్‌తో హీరో పెళ్లి చేసి తండ్రి అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది. ఎంతో కష్టపడ్డ హీరో తండ్రిని కాపాడుకోలేనట్లు చూపించకుండా.. 'నాన్నా.. అంతా సెట్ చేశాను. ఇక నేను తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను' అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో పావుగంటయినా పెంచాల్సింది. అలాగే శ్రీకాంత్‌తో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదు? చిన్నచిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. -
అలా చేసి ఉంటే సినిమా మరింత బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్‌లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు. 18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్ తెరకెక్కించారు. ఫస్టాఫ్ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్ వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్‌ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు. -
ఆ తపనతో ఈ సినిమా చేశారు
‘‘అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్’.. ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటిది ‘దేశంకోసం భగత్ సింగ్’ సినిమాలో రవీంద్ర గోపాల్ ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు చేయడం గొప్ప విషయం’’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘అన్నల రాజ్యం, నాగమ నాయుడు, రాఘవేంద్ర మహత్యం’ లాంటి సినిమాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం భగత్‌సింగ్’. ప్రమోద్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ–‘ ‘స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు రవీంద్ర. ఈ సినిమా చూశా.. బాగుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 3న మా సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు రవీంద్ర గోపాల్. -
ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి గోపాలకృష్ణ
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ) తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాని తెరకెక్కించిన విధానం బాగుందని కొనియాడారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. చిన్న కథను దర్శకుడు సాయి కిరణ్ ఎంతో నేర్పుతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి ప్రతిభ చూపారని ప్రశంసించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'మసూద సినిమా ఓ చిన్న కథ. అద్భుతంగా నడిచిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయా అనే కోణంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా చూస్తే ఆత్మలు ఉన్నాయనే నమ్మకం ప్రేక్షకులకు కచ్చితంగా వస్తుంది. ఈ కథలో ఓ తల్లీ, బిడ్డ ఆధారంగా తెరకెక్కించారు. నాజియా అనే అమ్మాయిని మసూద ఆత్మ ఆవహిస్తే ఏం జరిగిందనేదే కథ. సాయి కిరణ్ ఓ వైపు మంచి ప్రేమకథను చూపించారు. కాసేపటికే కథను మలుపులు తిప్పారు. కథను మలిచిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలకు బ్యాక్ గ్రౌండ్ ముఖ్యం. కాంతారలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను వణికించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత) అయితే ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. మసూద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ సినిమా ఆరంభంలోనూ.. మళ్లీ మధ్యలోనూ చూపించారు. అలా కాకుండా ఒకేసారి మధ్యలో ఆ కథ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. సినిమా క్లైమాక్స్‌లోనూ మసూద ఆత్మను బయటకు పంపించేటప్పుడు హీరోపై ఎటాక్ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో నజియాలో ఆత్మ.. చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేసినట్లు చూపారు. కానీ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఆత్మ ఎలా ఉంటుంది అనే సందేహం వచ్చిందన్నారు. సినిమా కల్పన కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడొచ్చని పరుచూరి వివరించారు. -
ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రిలీజైన సమంత మూవీ యశోదపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. ఈ మూవీ ఓ సందేశాత్మక చిత్రమని కొనియాడారు. హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో సమంత చాలా బాగా చేసిందని.. ఆమె అద్భుతమైన నటి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకులు హరి, హరీశ్ సమంత పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. అయితే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలాగా.. యశోద మూవీని ఆమె చేస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయశాంతి ఇలాంటి పాత్రలను అవలీలగా చేయగలదన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం.. దీన్ని కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందని పరుచూరి కొనియాడారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుందన్నారు. యశోద ఓ అద్భుతమైన ప్రయోగమని తెలిపారు. యశోద చిత్రాన్ని చూసినప్పుడు ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించాలో ఇందులో నేర్చుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. చివరిగా నా కోసమైనా ఈ సినిమాను ఒక్కసారి చూడండని ఆయన కోరారు. -
ఎఫ్-3 మూవీని వెంకీ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు: పరుచూరి
అనిల్ రావిపూడి తెరెకెక్కించిన ఎఫ్-2తో పోలిస్తే ఎఫ్-3 అంత బాలేదని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా ఎఫ్-3 మూవీపై తన రివ్యూను వీడియో ద్వారా విడుదల చేశారు. ఎఫ్-2లో భార్యభర్తల మధ్య పెత్తనం అనే అంశం అందరికీ కనెక్ట్ అయ్యింది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. కానీ రీసెంట్గా నేను ఎఫ్-3 సినిమాను చేశాను. గతంలో 'శ్రీ కట్న లీలలు'లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్‌లో చేశారనే అనుమానం నాకు కలిగింది. సెకండ్ ఆఫ్‌లో మురళీ శర్మ కొడుకుగా వెంకీని చూపించడం అతకలేదు. మన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం సహా సెకండాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ అర్థం పర్థం లేనట్లు అనిపించింది. కాస్త లాజిక్ లేకున్నా వెంకటేశ్ ఒప్పుకోడు. ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ నడుపుకుంటూ ఉంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా చేయడం అంతగా నప్పలేదు. ఇలా ఎన్నో తప్పులున్నా చివరి 20నిమిషాలే ఎఫ్-3ని బతికించాయి అని పరుచూరి చెప్పుకొచ్చారు. -
ఓటమి అనేది నా జీవితంలోనే లేదు
‘‘గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్ కూడా అలాంటివాడే. నేను హీరోగా తెలుగు, తమిళ, కన్నడ మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు సంపాదిస్తే, ప్రభాస్ ఏకంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు’’ అన్నారు కృష్ణంరాజు. రేపు (జనవరి 20) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు కృష్ణంరాజు. సతీసమేతంగా కేక్ కట్ చేసిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అందరికీ ఏదో ఓ వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితుల్ని చేసుకోవడం వ్యసనం. ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం, మనవూరి పాండవులు’ వంటి సినిమాలు చేశా. ‘తాండ్రపాపారాయుడు’ సమయంలో 5వేల మందితో యుద్ధ సన్నివేశాలు తీశాం. అంతమందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి తెలిసింది. ఇప్పుడు మా బ్యానర్లో ప్రభాస్ కొత్త చిత్రం వస్తుంది. 3 నెలలపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నేను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలనుకుంటాడు తప్ప తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోడు. నేను కూడా అంతే. ఈ కృష్ణంరాజు ఓటమిని ఎప్పుడూ అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమి అనేది నా జీవితంలోనే లేదు’’ అన్నారు. అనంతరం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కష్ణంరాజుని సత్కరించింది. -
రచయితలు సరస్వతీ పుత్రులు
‘‘రచయితల సంఘం అంటే సరస్వతీ పుత్రుల సంఘం. అలాంటి సరస్వతీపుత్రుల సంఘం లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈ ఏడాది నవంబరు 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ని ఫిలిం నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగిన కరై్టన్ రైజర్ వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. 1932 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తు చేసుకున్నారు కొందరు అగ్ర రచయితలు. ఈ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘‘లక్ష్మీ ఎదురుగా వస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడ ఉన్నా వెతికి వెతికి నమస్కరించు’ అని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. రచయితలకు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. కాలంతో పాటు రచయిత రచనల్లోనూ మార్పు వచ్చింది. ఆ రచనలు మంచి మర్గానికి దోహదపడాలి. నేను పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదైనా సీన్ రాసేప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోయి డైలాగ్స్ రాసేవారు’’ అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట ఉండేదని అభిప్రాయపడ్డారు. రచయిత సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు ఎస్.వి. రామారావు. పాతాళభైరవి, మిస్సమ్మ...వంటి నాటి ప్రముఖ సినిమాలు, దర్శకులు, రచయితల గురించి మాట్లాడారు నాగబాల సురేష్. 1 950 నుంచి 60వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. 1961–70 నాటి కాల సినిమాల గురించి ప్రస్తావించారు వడ్డేపల్లి కృష్ణమూర్తి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్లాల్సిన దశాబ్దం ఇదే అన్నారు చిలుకుమార్ నట్రాజ్. 1981–90 కాలంలో ఉన్న రచయితలు, దర్శకులు, సినిమాల గురించి మాట్లాడారు అనురాధ. ఈ కార్యక్రమంలో బలభద్రపాత్రుని రమణి, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది
‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
టీయస్సార్ మీద బయోపిక్ తీయాలి
2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ పేరుతో అవార్డ్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా టీయస్సార్ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కేయస్ రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు. అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్ఫుల్ మీడియమ్. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్ ఫంక్షన్లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల ఓటింగ్‌ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్‌కు శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ అందిస్తాం’’ అన్నారు. ‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్‌గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్‌గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్మాష్టార్’ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా. ‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్. ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్ ఆఫ్ టీయస్సార్’ పేరుతో ఆ బుక్ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్ వరుసగా ఈ అవార్డ్ పంక్షన్స్ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. ‘‘హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు. -
25న ‘శోభన్ బాబు’ అవార్డ్స్
దివంగత హీరో శోభన్ బాబు అభిమానులు ‘శోభన్ బాబు సేవాసమితి’ పేరిట ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు చెప్పేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మొత్తం 19 అవార్డులు ఇస్తున్నాం. వాటిల్లో ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్గ్రీన్ అవార్డులు, తొమ్మిది ప్రామిసింగ్ అవార్డ్స్ ఉంటాయి. ఈ కేటగిరీల్లో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, సంగీత దర్శకుడు, కమెడియన్లు ఉంటారు. అవార్డుల ప్రదానోత్సవానికి కృష్ణంరాజుగారు ముఖ్య అతిథిగా వస్తున్నారు’’ అన్నారు. ‘‘జనవరి 14న శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని కర్నూలులో వేలాది మందితో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ఎమ్మెల్సీ, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి ప్రతినిధి ఎం. సుధాకర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో నటుడు, ఎంపీ మురళీమోహన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకులు రేలంగి నరసింహారావు, రాశీ మూవీస్ నరసింహారావు, నిర్మాత జె. రామాంజనేయులు, నటుడు సంపూర్ణేష్ బాబు, శేష్ట రమేష్ బాబు, పలువురు శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు. -
బుర్ర కథ చూడండహో
‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం ఆడోరకం, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘డైమండ్’ రత్నబాబు మెగా ఫోన్ పట్టారు. ఆది సాయికుమార్ హీరోగా ఆయన డైరెక్షన్లో ‘బుర్రకథ’ అనే సినిమా తెరకెక్కనుంది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత, పాటల రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా కెమెరా స్విచ్చాన్ చేయగా రచయిత పరుచూరి గోపాల కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టాప్ టెక్నీషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు నిర్మాతకి, నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న ఆదిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘బుర్రకథ’ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వారంలో హీరోయిన్స్, ఇతర నటీనటులను ఓకే చేయనున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ దీపాల. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రామ్ ప్రసాద్. -
గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ
‘సమ్మోహనం’ హిట్ తర్వాత సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సుధీర్ బాబు, మెహరీన్ జంటగా పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఖుర్షీద్ (ఖుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: పి.వి శంకర్. -
విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న ప్రపంచ వ్యాపారసదస్సు (జీఈఎస్)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. Thanks Sir 🙏 https://t.co/B7u1FfkSNp — KTR (@KTRTRS) 30 November 2017 మన మెట్రో.. మన గౌరవం! బుధవారం నుంచి నగరప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో గురించి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తొలిరోజు హైదరాబాద్ మెట్రో అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని, రెండోరోజు నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని నాకు చెప్పారు. కాబట్టి హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ మెట్రో సంస్థ, ఎల్అండ్ కంపెనీ అప్రమత్తంగా ఉంటూ రద్దీని నియంత్రించాలి. పిల్లలు, వృద్ధులు, సాటి ప్రయాణికుల పట్ల ధ్యాస కనబర్చాలని హైదరాబాదీలను కోరుతున్నా. మన మెట్రో, మన గౌరవం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో తొలిరోజే 2 లక్షలమంది ప్రయాణికులతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. -
పరుచూరి చేసిన పెళ్లి
ఎమ్మెస్ నారాయణది కులాంతర వివాహం. భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ కళాప్రపూర్ణను ఆయన ప్రేమించారు. ఆమె కూడా ఇష్టపడింది కానీ, వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్లో తమకు లెక్చరరైన పరుచూరి గోపాలకృష్ణ సహాయం తీసుకున్నారు. స్వతహాగా కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కావడంతో దగ్గరుండి ఎమ్మెస్ పెళ్లి జరిపించారు పరుచూరి. చిత్రపరిశ్రమకు వచ్చేటప్పుడు కూడా గోపాలకృష్ణను ఎమ్మెస్ సంప్రతించారు. సినిమాల్లోకొచ్చాక చానాళ్లు ఎమ్మెస్‌కి అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఊరెళ్లిపోతానని చెబితే, ‘మంచి టైమ్ వస్తుంది. ఓపిక పట్టు’ అని ఆయన గురువు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ మాటలకు విలువ ఇచ్చి, ఆయన ఉండిపోయారు. పైకొచ్చాక పలు సందర్భాల్లో ‘ఆ రోజు ఓపిక పట్టమని మాస్టారు నాకు మంచి సలహా ఇచ్చారు’ అనేవాడని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. -
'ఎంఎస్ ప్రేమపెళ్లి చేసింది నేనే'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ నటుడుగా, రచయితగా మాత్రమే ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తెలుసునని... అయితే అతడు తనకు విద్యార్థి అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఎంఎస్‌కు తాను పాఠాలు చెప్పానని.. కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే అతని పెళ్లికి పెద్దరికం వహించింది తానేనని చెప్పారు. కళాప్రపూర్ణను ఎంఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నారు. బతుకుదెరువు కోసం ఎంఎస్ ఓ సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేశాడని చెప్పారు. అనుకున్నది చేయాలి, ఎవరికీ అన్యాయం చేయకూడదనేది ఎంఎస్ నైజం అని పరుచూరి తెలిపారు. ఎంఎస్, అతని భార్య కళాప్రపూర్ణ భీమవరంలో ఉద్యోగం చేసేవారని, చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు తననే కలిశాడని ఆయన పేర్కొన్నారు. సినీ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడని, అయితే ఒకానొక సమయంలో అవకాశాలు రాకపోవటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో తిరిగి వెళ్లిపోతానని చెప్పాడని, అయితే ప్రతి ఒక్కరికీ మంచి రోజు వస్తుందని, అప్పటివరకూ ఓర్చుకోవాలని ఎంఎస్‌కు తాను ధైర్యం చెప్పానన్నారు. ఆ తర్వాత 'మా నాన్నకు పెళ్లి' చిత్రం ద్వారా ఎంఎస్ దశ తిరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూడలేదని పరుచూరి అన్నారు. అనంతరం తనను కలిసిన ఎంఎస్ .. వెళ్లిపోవద్దని మంచి సలహా ఇచ్చారు మాస్టారు అని అన్నాడని ఆయన తెలిపారు. ఆరోగ్యం గురించి ఎంఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, గురువారం కూడా అతడిని చూశానని, అతనికి ఉన్న ధైర్యాన్ని చూస్తే త్వరగా కోలుకుంటాడనుకున్నానన్నారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకపోవడం బాధాకరమని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. -
రెడీ...స్టార్ట్
‘మేము సైతం’ అంటూ విశాఖవాసులకు భరోసానిస్తున్న టాలీవుడ్ ఈవెంట్ సక్సెస్ కోసం ఫుల్‌గా ప్రిపేరవుతోంది. పది రోజులుగా రిహార్సల్స్‌లో మునిగిపోతున్నారు సినీజనాలు. ఆదివారం జరిగే 12 గంటల లైవ్ షో ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పలువురు నటీనటులు వెరైటీ స్కిట్స్‌తో రెడీ అవుతున్నారు. డ్యాన్స్, షోస్ ప్రాక్టీస్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. ఇంకొందరు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ ‘కూత’ పెడుతున్నారు. స్టార్స్ క్రికెట్లో బౌండరీలు బాదడానికి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ రంగంలోకి దిగిన ఇండస్ట్రీ ప్రాక్టీస్ సెక్షన్ ముచ్చట్లు మీ కోసం.. అందరూ భాగస్వాములే.. విశాఖవాసులకు ఎవరూ తీర్చలేని కష్టం వచ్చింది. దాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. మా వంతు సాయం చేయడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. మాకు వచ్చిన కళతోనే దీన్ని ఎదుర్కోవాలని మేముసైతం కార్యక్రమానికి పూనుకున్నాం. టాలీవుడ్ ఫ్యామిలీ తరఫున చేస్తున్న బృహత్కార్యం ఇది. ఇండస్ట్రీలోని అందరూ వివిధ పెర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. కమెడియన్స్ కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. నేను క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఈవెంట్ ద్వారా మేమందిస్తున్న సహాయం వారికి కొంతైనా ఓదార్పునిస్తుంది. మాతో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వైజాగ్ పునరుద్ధరణలో భాగస్వాములు కావాలి. - నాగార్జున ఎంత కష్టం.. విశాఖలో కొన్ని వందల షూటింగ్‌లు చేసుంటాం. అక్కడ ప్రతి అంగుళం మా సినీజనానికి తెలుసు. అవన్నీ సుడిగాలి తీవ్రతకు సర్వనాశనమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు రూ.16 కోట్ల విలువైన సామగ్రి పంపించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఇండస్ట్రీ ఆదుకుంటుందని గతంలో ఎన్నోమార్లు రుజువైంది. ఆ ఆదర్శంతోనే ఈరోజు మేమంతా ముందుకు వచ్చాం. రచయితలమంతా కలసి స్వచ్ఛభారత్‌పై జొన్నవిత్తుల రాసిన ఓ స్కిట్‌ను ప్రదర్శిస్తున్నాం. - పరుచూరి గోపాలకృష్ణ తలో చెయ్యి.. వారం రోజులుగా నటీనటులందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దామూ నేతృత్వంలో ఈ సెక్షన్ నిర్వహిస్తున్నాం. బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ, కోడి రామకృష్ణ, నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్, ఈవీవీ సత్తిబాబు, శివారెడ్డి ఇలా అందరూ స్కిట్స్ చేస్తున్నారు. నేను, ఖయ్యూం ఇద్దరం వీటిని కో ఆర్డినేట్ చేస్తున్నాం. - కాదంబరి కిరణ్ అందరివాళ్లం.. హుద్‌హుద్ తీవ్రతకు బ్యూటిఫుల్ వైజాగ్ కళావిహీనమైపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంతా కలసి వారికి సాయం చేయాలని ముందుకు వచ్చింది. క్రికెట్లో నేను వెంకటేష్ టీమ్‌లో ఉన్నాను. నాలుగు జట్లు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్స్ ఆరు ఓవర్లు సాగుతుంది. నేను సీసీఎల్, టీసీఐ టీమ్‌లలో ఉన్నాను. అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉంటాను. - నవీన్ చంద్ర ఉడతాసాయం నాకు క్రికెట్ అంటే ప్రాణం. విశాఖవాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తున్న గొప్ప కార్యక్రమమిది. ఉడతాసాయంగా నేను అందులో పాలుపంచుకోవాలనుకున్నాను. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 900 గ్రాముల లైట్‌వెయిట్ బీడీఎం బ్యాట్స్ తెప్పించాను. హీరో నాగార్జునకు అందించాను. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్లకూ ఇస్తాను. - చక్రపాణి, స్పోర్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ చైర్మన్ బాధ్యతగా ఫీలవుతున్నాం.. వైజాగ్ ఒక ప్రళయాన్ని చూసింది. ఈ సమయంలో వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే ఇండస్ట్రీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో నేను భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. - నాని క్రికెట్, కబడ్డీ కూడా.. ఎంటర్టైన్మెంటే కాదు.. ఇలాంటి సందర్భాల్లో కూడా అండగా ఉంటామని టాలీవుడ్ నిరూపించింది. డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్తో పాటు క్రికెట్, కబడ్డీ జట్టుల్లో కూడా ఉన్నాను. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. - తనీష్ స్టే స్ట్రాంగ్ మా సినిమాలను ఆదరించిన కామన్ పీపుల్ కష్టాల్లో ఉంటే స్పందించడం మా కనీస బాధ్యత. నేను కబడ్డీ జట్టులో ఉన్నాను. స్కిట్లో కూడా యాక్ట్ చేస్తున్నా. గుడ్ కాజ్ గురించి చేస్తున్న ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. స్టే స్ట్రాంగ్ మీకు మేమున్నాం. - నవదీప్ పది రోజులుగా.. మేముసైతంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను స్కిట్స్ కో ఆర్డినేట్ చేస్తున్నాను. పది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఎమ్మెస్, రఘుబాబు, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి.. ఇలా అందరు నటులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే నేను రామ్‌చరణ్‌తేజ్ టీమ్‌లో ఉన్నాను. - ఖయ్యూం ప్రత్యేక అనుబంధం.. నా మొదటి సినిమా వేదం వైజాగ్‌లోనే షూట్ చేసుకుంది. ఆ సిటీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయం చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ విశాఖవాసులకు చేయూతనివ్వాలి. డ్యాన్స్‌తో పాటు క్రికెట్ కూడా ఆడుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌లో ఉన్నాను. ఫ్యాషన్ పెరేడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. - దీక్షాసేథ్ ఎప్పుడూ సిద్ధం.. గతంలో దాసరి గారు, మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన చారిటీ ఈవెంట్లలో పాల్గొన్నాను. మేముసైతం సక్సెస్ కోసం నటీనటులంతా కష్టపడుతున్నారు. నేను హంసనందిని, దీక్షాసేథ్, ఊర్వశి, తనీష్ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను. - సత్య మాస్టర్ అందుకే వచ్చా.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా నడవటం సంతోషంగా ఉంది. మేముసైతం కాజ్ నచ్చడంతో టాలీవుడ్‌తో పరిచయం లేకున్నా.. ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాను. నేను టాలీవుడ్ నటిని కాకపోయినా.. వారు చేసే మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. - ఊర్వశి రౌటెల ..:: శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా -
ప్రతిష్ఠాత్మకంగా నా వందో సినిమా
‘‘తెలుగు నేల రెండుగా విడిపోయినా... తెలుగువారందరూ ఒక్కటే. అందరూ కలిసి మెలిసి ఉండాలి. ఇరు ప్రాంతాలూ గొప్పగా అభివృద్ధి చెందాలి’’ అని బాలకృష్ణ అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు బాలకృష్ణ. ‘‘మహానటుడు నందమూరి తారకరామారావుగారి బిడ్డగా పుట్టడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అభిమానులు అందించిన ప్రోత్సాహంతో అద్భుతమైన పాత్రలు పోషించి, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు నాన్న. ఇప్పుడు నేను కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నాను’’ అన్నారు బాలకృష్ణ. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు సినిమాలకన్నా ప్రజలే ముఖ్యమని, అటు నటునిగా, ఇటు బాధ్యతగల ప్రజానాయకునిగా తాను పూర్తి చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని అందుకే మంత్రి పదవిని సైతం కాదనుకున్నానని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రారంభమైన తన 98వ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంటుందని, తరువాత రూపొందే తన 100వ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండనుందని బాలకృష్ణ ప్రకటించారు. తదనంతరం జరిగిన బాలకృష్ణ సన్మాన కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, నందమూరి రామకృష్ణతో పాటు బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేశ్, భరత్‌లు కూడా పాల్గొన్నారు.